English | Telugu

రైతురాజ్యం ముసుగులో కేసీఆర్ రాచరిక పాలన: కోదండరాం

ప్రతిపక్షాలు ఏం చేయాలన్నా ప్రభుత్వానికి లాక్ డౌన్ నిబంధనలు గుర్తుకొస్తాయని ఆరోపించారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. అధికార పార్టీ చేస్తే మాత్రం గుర్తుకు రావన్నారు. టీజేఎస్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోదండరాం రైతురాజ్యం ముసుగులో సీఎం కేసీఆర్ రాచరిక పాలన సాగిస్తున్నాడని ఆరోపించారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు ఐక్యంగా పని చేస్తామన్నారు. డబ్ల్యూహెచ్ఓ నిబంధనల ప్రకారం కరోనా పరీక్షలు చేయాలని కోరామన్నారు.

మద్యం అమ్మకాల తో కరోనా వ్యాప్తి పెరిగితే కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆరు వారాల లాక్ డౌన్ లో సమాచారం సేకరించి సీఎస్ కి పంపిస్తే సీఎం అవహేళనగా మాట్లాడుతున్నారన్నారు. చిల్లర రాజకీయాలు ఎవరివో ప్రజా క్షేత్రంలో బయటపడతాయని హెచ్చరించారు. కోదండరాం నేతృత్వంలో ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడుతామన్నారు విపక్షాల నేతలు.

అసంఘటిత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించాలని డిమాండ్ చేశారు. లాక్ డౌన్ పొడగించిౌలిక్కర్ అమ్మకాలు చేయడంతో జనం పెద్ద ఎత్తున బయటకు వస్తున్నారన్నారు. రెడ్ జోన్ లలో మద్యం అమ్మకాలను పూర్తిగా నిలిపేయాలన్నారు. పేదల కరెంటు బిల్లులను మాఫీ చేయడంతో పాటు ఇసుక అక్రమ రవాణాను ఆపాలని డిమాండ్ చేశారు. లాక్ డౌన్ లో ధాన్యం కొనుగోలు లో ప్రభుత్వం విఫలమైందన్నారు.

మీ ఆదాయాలు పెంచుకుంటున్నారు తప్పితే పేదల కష్టాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ప్రకటించడంలో ప్రభుత్వానికి పారదర్శకత లేదన్నారు. అఖిల‌ప‌క్షం పలు పార్టీలకు చెందిన నేతలు ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.