English | Telugu

మే చివ‌రి నాటికి ఇండియాలో 3 లక్షలు కరోనా కేసులు?

కోవిడ్ 19 భారతదేశంలో ఇలా విస్తరిస్తోంది!

మార్చి 05. 30 కేసులు
మార్చి15. 114 కేసులు
మార్చి 25. 657 కేసులు
మార్చి 31. 1397 కేసులు
ఏప్రిల్ 05. 4289 కేసులు
ఏప్రిల్ 10. 7600 కేసులు
ఏప్రిల్ 20. 18539 కేసులు
ఏప్రిల్ 30. 34863 కేసులు
మే 05. 49400 కేసులు

క‌రోనా విస్త‌ర‌ణ వేగం ఇలా వుండ‌బోతోంది....
70000. మే 10 వరకు
140000. మే 20 వరకు
మే నెల చివరి వరకు 3 లక్షలు

మొన్నటి వరకు భారత్ లో కరోనా ఎఫెక్ట్ తక్కువగా ఉందని అంతా అనుకున్నప్పటికీ. క్రమంగా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటికే 53వేలు దాటిక కరోనా కేసులు. జూన్-జులై నాటికి భారీగా పెరిగే అవకాశం ఉందని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ అధికారికంగా ప్రకటించారు.

దేశంలో ప్రస్తుతం 53వేల పైచిలుకు కేసులున్నాయి. 1783మంది మరణించగా, 15,267మంది కోలుకున్నారు. అయితే. కేసుల సంఖ్యను నిశితంగా పరిశీలిస్తే గడిచిన వారం-పది రోజుల నుండి కేసుల సంఖ్య ప్రతి రోజు పెరిగిపోతూనే ఉంది. గత 24గంటల్లో 3వేలకు పైగా కేసులు వచ్చాయి. మొన్నటి వరకు వెయ్యిలోపు, ఆ తర్వాత రెండు వేల మధ్య వచ్చిన కేసులు ఇప్పుడు మూడు వేలు కూడా దాటాయి.

ఇండియాలో మే నెలలో కరోనా పీక్స్ లో ఉంటుందని డేటా విశ్లేషించినప్పటికీ, లాక్ డౌన్ కారణంగా కేసుల వేగం తగ్గింది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ బట్టి జూన్-జులై నాటికి కేసుల సంఖ్య అత్యధిక స్థాయిలో ఉంటుందని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గలేరియా ప్రకటించారు. అయితే. అంచనాలకు మించి కేసులు నమోదు కావచ్చని స్పష్టం చేశారు.

దేశంలో మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య విపరీతంగా ఉండగా. తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ కనపడుతోంది. బెంగాల్ లో కేసుల సంఖ్య పెరుగుతుండటం కూడా గమనిస్తే. కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

కాబ‌ట్టి ఎవరినీ కలవవద్దు, క్లోజ్ ఫ్యామిలీని సందర్శించవద్దు. ఇంటి వద్ద ఉండండి. సురక్షితంగా ఉండండి.