English | Telugu

దూకుడు గా సాగిన కె సి ఆర్ ప్రెస్ మీట్ అందరికీ భరోసా ఇచ్చింది

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీడియ కాన్ఫరెన్స్ లు చూశారుగా. తెలంగాణ ముఖ్యమంత్రి కె సి ఆర్ ఎంత వేగంగా, వడగళ్ల వాన లాగా గడ గడా తాను చెప్పాల్సింది చెప్పేసి, ప్రజలను అప్రమత్తం చేసిన తీరు అందరి ప్రశంసలూ అందుకుంది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం ' మనం కూడా ' అంటూ ప్రెస్ మీట్ సాగదీసిన తీరు ఆడియెన్స్ ను, ప్రజలను బాగా నిరాశ పరిచింది. ప్రజలకు సూటిగా, స్పష్టం గా చెప్పటం లో కె సి ఆర్ ఫాలో అయిన టెక్నీక్, ఎందుకో జగన్ మోహన్ రెడ్డి ఫాలో కాలేకపోయారనేది నెటిజన్ల అభిప్రాయం. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాలు ఈ నెలాఖరు వరకూ లాక్ డౌన్ ప్రకటించాయి. అయితే, ఈ విషయాన్నీ కె సి ఆర్ కన్వే చేసినంత స్పష్టంగా,జగన్ మోహన్ రెడ్డి చేయలేకపోయారనేది సోషల్ మీడియా అభిప్రాయం. సో, జగన్ సార్.. కొంచెం ' మనం కూడా... " ట్రాన్స్ లోనుంచి వెలుపలకు వచ్చి, కె సి ఆర్ అంత స్పష్టంగా సమాచారం అందచేయండి...