English | Telugu
ఈ నెల 31 వరకు తెలంగాణాలో లాక్ డౌన్
Updated : Mar 22, 2020
వారం రోజులు ఇళ్లలోనే వుండండి. ఆ ఒక వారం మీ జీవితాన్నే కాపాడుతోంది. మీమ్మల్ని, మీతో పాటు దేశాన్ని కాపాడండని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇటలీ లాంటి దుర్గతి మనకు పట్టవద్దంటే మనమే మనల్ని కాపాడుకోవాలని సి.ఎం. సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారు హోం క్వాంరెంటైన్ లోనే వుండండి. దాచి పెట్టవద్దు. మీకు మీరు నియంత్రణ పాటించండి. భయోత్పాత స్థితిలో ప్రపంచం వుంది. దయచేసి ఆషామాషీగా తీసుకోకుండా స్వయం నియంత్రణపాటించండి. మన కుటుంబాన్ని, మన దేశాన్ని మనం ధ్వంసం చేసుకుందామా అంటూ ముఖ్యమంత్రి సూచించారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై సీఎం కేసీఆర్ అత్యున్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. సీఎస్‌తో పాటు డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు సీఎంతో భేటీ లో పాల్గొన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పరిస్థితి రోజు రోజుకీ చేజారిపోతుందన్న అనుమానాన్ని ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంలోనే లాక్‌డౌన్ ప్రకటిస్తే పరిస్థితి అదుపులోకి వస్తుందని కేసీఆర్ సర్కార్ భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.