English | Telugu

పేద‌ల‌కు 12 కిలోల బియ్యం 1500/- ఆర్థిక సాయం!

రోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం మార్చి 31వరకు లాక్ డౌన్ ప్రకటించింది. తెల్లరేషన్ కార్డుదారులకు ప్రతిమనిషికి ఉచితంగా 12 కిలోల రేషన్ బియ్యం, 1500 రూపాయ‌ల‌ ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.

అత్యవసర సర్వీసులు తప్ప మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదన్నారు. 20 శాతం ఉద్యోగులు మాత్రమే రొటేషన్ పద్ధతిలో విధులకు హాజరవుతారని తెలిపారు. తెలంగాణలో ఆదివారం ఒక్కరోజే 5 వరకు పాజిటీవ్ కేసులు న‌మోదు కావ‌డం ఆందోళ‌న క‌ల్గించింద‌ని చెప్పారు.

ప్రైవేటు ఉద్యోగులకు ఈ సెలవుల కాలానికి కంపెనీలు వేతనాలు చెల్లించాలని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాపించిన జిల్లాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింద‌ని ఆయ‌న చెప్పారు. తెలంగాణలోని 5 జిల్లాలు, హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కరోనా వైరస్‌ ప్రభావం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని సి.ఎం. తెలిపారు.

అంత‌ర్జాతీయ పోర్టులు, అంత‌ర్జాతీయ విమానాశ్రాయాలు ఈ రోజు నుంచి పూర్తిగా బంద్ అయ్యాయి. కాబ‌ట్టి విదేశాల నుంచి వారి భ‌యం ఇక లేదు. ఇప్పటివరకు తెలంగాణాలో 26 పాజిటివ్ కేసులు నమోదయినట్టు సి.ఎం. తెలిపారు. అయితే వీరు విదేశీయులని పేర్కొన్నారు. దీంతో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ రోజు ఏవిధంగా బాధ్యతాయుధంగా కర్ఫ్యూని పాటించారో.. మార్చి 31వ తేదీ వరకూ ఈ విధంగానే ఇంట్లో ఉండాలని కోరారు.