English | Telugu
జూన్ 1 నుంచి ఆలయాలు తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్
Updated : May 27, 2020
ఆలయాలు తెరిచే విషయమై కర్ణాటక సీఎం యడియూరప్ప ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. అనంతరం ఆ రాష్ట్ర మంత్రి కోటా శ్రీనివాస్ పూజారి మాట్లాడుతూ.. జూన్ 1 నుంచి ఆలయాలను తెరుస్తున్నట్లు ప్రకటించారు. అన్ని రకాల పూజా కార్యక్రమాలు కొనసాగనున్నట్లు తెలిపారు. బుధవారం నుంచి 52 దేవాలయాల్లో ఆన్‌లైన్ బుకింగ్ సేవా కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అన్ని జాగ్రత్తలతో ఆలయాల్లోకి భక్తులను అనుమతిస్తామన్నారు. ఆలయాల్లో భక్తులు భౌతిక దూరం పాటించేలా చూస్తామన్నారు. పరిస్థితులను అనుసరించి పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతిస్తామన్నారు.