English | Telugu

అమెరికాలో భారతీయ మహిళ హత్య, భర్త ఆత్మహత్య

ఐదు నెలల గర్భవతి అయిన 35 ఏళ్ల భారతీయ మహిళ హత్యకు గురైయ్యారు. ఆమె భర్త సమీపంలోని హడ్సన్‌ నదిలో ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్‌ 26న గరిమా కొఠారి తన నివాసంలో హత్యకు గురికాగా, ఆమె శరీరంపై పలు కత్తిపోట్లు ఉన్నాయని ఉన్నతాధికారులు తెలిపారు. కొఠారి భర్త మన్‌మోహన్‌ మాల్‌ (37) మృతదేహాన్ని నది నుండి స్వాధీనం చేసుకున్నామని అన్నారు.

వీరిద్దరూ 'నుక్కడ్‌' రెస్టారెంట్‌ను నడుపుతున్నారని, వారు మంచి జంట అని రెస్టారెంట్‌ ఉద్యోగులు పేర్కొన్నారు. మాల్‌ కూడా అందరితో స్నేహపూర్వకంగా వ్యవహరించేవారని అన్నారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటి) పూర్వ విద్యార్థి అయిన మాల్‌ కొలంబియా యూనివర్శిటీలో మాస్టర్స్‌ డిగ్రీ చేసేందుకు అమెరికా వెళ్లారు.

మాల్‌ మరణానికి గల కారణాలు తెలియలేదని అన్నారు. న్యూజెర్సీ సిటీ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ సహాయంతో ప్రత్యేకాధికారులు ఈ కేసును విచారిస్తున్నాయని తెలిపారు.