English | Telugu

హోరా హోరీగా మారిన హుజూర్ నగర్ ఎన్నికల ఫలితాలు...

రాష్ట్ర ప్రజలు అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి హుజూర్ నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది. ఆయా పార్టీలకు చెందినటువంటి ఏజెంట్ లు కౌంటింగ్ హాల్ లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్, పద్మావతి రెడ్డి కూడా కౌంటింగ్ కేంద్రంలోనే ఉన్నారు. మొత్తం ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఫలితాలు,విజయం ఎవరిదో ఈ రోజు తెలియనుంది. ముఖ్యంగా కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ కౌంటింగ్ అయితే కొనసాగుతోంది. అధికార యంత్రాంగం మొత్తం కూడా కౌంటింగ్ కేంద్రాల దగ్గరనే ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆర్వోతో పాటు కేంద్రం పంపించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చినటువంటి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులతో పాటు వంద మంది సిబ్బంది కూడా అక్కడే ఉన్నారు. దాదాపు మొత్తం పద్నాలుగు టేబుళ్లు ఏర్పాటు చేసి ఇరవై రెండు రౌండ్స్ గా ఫలితం వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం. మొత్తం మీద ఒక్కొక్క రౌండ్ అయితే దాదాపు ఇరవై నిమిషాల సమయం తీసుకుంటున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతుంది. మరి కొద్దిసేపట్లో తుది ఫలితం వెలువడే అవకాశం కన్పిస్తోంది. ఉదయం ఎనిమిది గంటలకి కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత సర్వీస్ ఓట్లు నూట ఒక్క సర్వీస్ ఓట్లున్నాయి. ఆ సర్వీస్ ఓట్లను లెక్కించిన తరవాత ఆ స్ట్రాంగ్ రూంలో భద్రపరిచినటువంటి ఈవీఎంలని ప్రత్యేక పహారా మధ్య ఈ కౌంటింగ్ కేంద్రానికి తీసుకువచ్చారు. అక్కడ ఈవీఎంలన్నీ తెరచి ఏజంట్ల సమక్షంలో రౌండ్స్ వారిగా లెక్కిస్తున్నారు. మొత్తం మీద ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి ఈ ఎన్నికల్లో ఇప్పటికే ప్రభుత్వం పై ప్రతిపక్షాల చేస్తున్నటువంటి విమర్శలకు దీటుగా ఈ స్థానాన్ని గెలిచి సరైనటువంటి జవాబు ఇవ్వాలనే ఉత్సాహంతో టిఆర్ఎస్ ఉంది. అలాగే హుజూర్ నగర్ ఆవిర్భవించి తాను మూడు సార్లు హ్యాట్రిక్ కొట్టినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాలుగువ సారి తన భార్య గెలుపుతో అక్కడ సత్తా చాటాలని కాంగ్రెస్ కూడా భావిస్తోంది. కానీ పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్ కంచుకోటలో గులాబీ జెండా ఎగిరేలా ఉంది.