English | Telugu

2037 వరకు ఏడు సినిమాల రిలీజ్ ప్రకటన..ప్రపంచ సినీ చరిత్రలో ఇదే తొలిసారి..అంతా విష్ణు మాయ 

చిత్ర నిర్మాణ సంస్థలకి భారతీయ చలన చిత్ర పరిశ్రమ మొత్తంపై స్టార్ స్టేటస్ రావడం చాలా అరుదు. అలాంటి అరుదైన నిర్మాణ సంస్థల్లో కన్నడ సినీ పరిశ్రమకి చెందిన 'హోంబలే ఫిల్మ్స్'(Hombale Films)ఒకటి. 2014 లో 'పునీత్ రాజ్ కుమార్(Puneeth Rajkumar)హీరోగా తెరకెక్కిన 'నిన్నదలే' చిత్రం 'హోంబలే' నిర్మించిన తొలి మూవీ. ఆ తర్వాత 'కేజిఎఫ్ చాప్టర్ 1 ,చాప్టర్ 2 , కాంతార, సలార్ వంటి పాన్ ఇండియా హిట్స్ తో అనతి కాలంలోనే అగ్ర నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది.

ప్రస్తుతం అశ్విన్ కుమార్(Ashwin Kumar)దర్శకత్వంలో 'మహావతార్.. నరసింహ'(Mahavatar Narsimha)అనే యానిమేటెడ్ మూవీని తెరకెక్కిస్తోంది. 2025 జులై 25 న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ మూవీకి కొనసాగింపుగా 'మహావతార్ సినిమాటిక్ యూనివర్స్' ని అందించాలనే లక్ష్యంతో, మహావతార్.. పరశురామ్ అనే చిత్రాన్ని 2027 వ సంవత్సరంలో, మహావతార్.. రఘనందన్ 2029 లో, మహావతార్...ద్వారకాధీశ్ 2031 ,మహావతార్.. గోకులనంద్ 2033 , మహావతార్.. కల్కి 1 2035 , మహావతార్.. కల్కి 2 2037 ఇలా వరుసగా ఏడు చిత్రాలని ప్రకటించి రికార్డు సృష్టించింది. ఈ విధంగా ప్రకటించడం వరల్డ్ సినీ చరిత్రలో ఇదే తొలిసారి అని చెప్పవచ్చు.

నరసింహ, పరశురామ్, రఘనందన్, ద్వారకాధీశ్, గోకులనంద్, కల్కి ఈ అవతరాలన్నీ శ్రీ మహా విష్ణువు కి సంబంధించినవి. దీంతో అందరిలోను ఈ యానిమేటెడ్ చిత్రాలపై ఆసక్తి నెలకొని ఉంది. హోంబలే సంస్థ ప్రస్తుతం కాంతార కి ఫ్రీక్వెల్ గా తెరకెక్కుతున్న కాంతార చాప్టర్ 1 ని అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ తో సలార్ పార్ట్ 2 శౌర్యంగపర్వం కూడా హోంబలే లిస్ట్ లో ఉంది.