English | Telugu
పెట్రోల్‌పై 10/- డీజిల్‌పై 13/- వడ్డింపు! కొరడా జులిపిస్తున్న మోదీ!
Updated : May 6, 2020
భారీగా తగ్గిన ధరల వెసులుబాటును ప్రజలకు మళ్లించకుండా.. కేంద్రం ఎక్సైజ్ రేట్లు పెంచకుంటూ పోతుంది. లీటర్ పెట్రోలు పై 10 రూపాయలు, డీజిల్‌పై 13 రూపాయలు పెంచుతూ మోదీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రెండు రూపాయలు ఎక్సైజ్ సుంకంకాగా, ఎనిమిది రూపాయలు రోడ్ సెస్ విధించింది. కొత్తగా కేంద్రం పెంచిన ధరలతో... దేశంలో లీటర్ పెట్రోలుకు దాదాపు 33 రూపాయలు ఎక్సైజ్ సుంకం రూపంలోనే కేంద్రం జేబులోకి వెళ్తుంది.
నరేంద్రమోడీ 2014లో ప్రధాని అయినప్పుడు పెట్రోలుపై ఎక్సైజ్ సుంకం కేవలం తొమ్మిదన్నర రూపాయలు మాత్రమే ఉండేది. అదిప్పుడు పెరుగుతూ పెరుగుతూ వచ్చి 33 రూపాయలకు చేరుకుంది. చమురు ధరల పతనం మొదలయ్యాక ఎక్సైజ్ సుంకం పెంచడం ఇది రెండోసారి. తగ్గిన చమురు ధరలు సామాన్యులకు దక్కకుండా కేంద్రం ఎక్సైజ్ సుంకం రూపంలో కేంద్రం తన ఖజానాకు మళ్లించుకుంది.