English | Telugu
నిమ్మగడ్డ తీర్పుపై ఉత్కంఠత! భారీగా బెట్టింగ్లు!
Updated : May 6, 2020
అయితే మాజీ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పదవిని తొలగించారంటూ హై కోర్టుకు వెళ్లారు. దాని మీద ఇపుడు కోర్టులో విచారణ జరుగుతోంది. దీనికి సంబంధించి శుక్రవారం తీర్పు వెలువడే అవకాశం ఉంది. అయితే ఈ తీర్పు ఎలా వస్తుందోనన్న ఉత్కంఠ అన్ని వర్గాల్లో ఉంది. ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ నే కొనసాగించాలని కనుక హైకోర్టు తీర్పు ఇస్తే అపుడు సంగతేంటన్న చర్చ కూడా ఉంది.
రమేష్ కుమార్ పేరు మీద ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎన్నికలు మధ్యలో ఉన్నాయి. అందువల్ల వాటిని కంటిన్యూ చేయాలంటే నిమ్మగడ్డనే కొనసాగించాలని ఆయన తరఫున న్యాయవాదులు వాదిస్తున్నారు.
అయితే నిమ్మగడ్డని తొలగించలేదని, చట్టంలో మార్పుల కారణంగానే ఆయన పదవీకాలం ముగిసిందని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు అంటున్నారు.
అయితే దీని మీద హైకోర్టు తీర్పు ఏ విధంగా వస్తుందో అని ఉత్కంఠత నెలకొంది. అందరి చూపు ఇపుడు శుక్రవారం హైకోర్టు ఇచ్చే తీర్పు మీద ఉంది. అంతే కాదు విచిత్రమైన బెట్టింగ్లు జరుగుతున్నాయి. గుంటూరు దగ్గర్లోనే ఒక క్లబ్ లో మూడు సామాజిక వర్గాలు. ఆ మూడు సామాజిక వర్గాలు కూడా ఆర్థికంగా బాగా సెట్ అయిన వారు చేసుకున్నటువంటి బెట్టింగులు.ఇక్కడ లక్షలకు లక్షలు చేతులు మారుతూ ఉంటాయి. నిమ్మగడ్డ కేసులో గెలుస్తారు అన్నదానిపై 100 కి 300 రూపాయల బెట్టింగ్లు ఇస్తున్నారట!