English | Telugu

తెగేదాకా లాగొద్దు.. జగన్ సర్కార్ కి ఐవైఆర్ హెచ్చరిక!!

నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయం పై ఏపీలో రగడ కొనసాగుతూనే ఉంది. ఏపీ అడ్వొకేట్ జనరల్‌ హైకోర్టు తీర్పు పై వివరణ ఇచ్చిన తరువాత అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మరింతగా పెరిగింది. తాజాగా ఈ అంశం పై ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు తాజా ట్వీట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని ఆయన తప్పుబట్టారు. హైకోర్టు ఆదేశించిన తర్వాతైనా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రమేష్ కుమార్ ను ఎన్నికల కమిషనర్‌గా తిరిగి చేర్చుకోవడం లేదని అయన ప్రశ్నించారు. తెగేదాక లాగితే ప్రతికూల పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. ఇదే సందర్బంగా అయన ఒక పత్రికలో వచ్చిన ఆర్టికల్ ను పోస్ట్ చేశారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని ఐవైఆర్ పరోక్షంగా డిమాండ్ చేశారు.