English | Telugu
1500 బెడ్స్‌తో ప్రత్యేక కరోనా హాస్పిటల్! గాంధీలో పిల్లలకు ప్రత్యేక వార్డు!
Updated : Apr 16, 2020
కరోనాపై పోరాటానికి తెలంగాణా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమాయత్తం అయింది. పెరుగుతున్న కేసుల్ని ధీటుగా ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పట్టికే గచ్చిబౌలిలో 1500 బెడ్స్ తో కరోనా పేషెంట్ల కోసం ప్రత్యేక హాస్పిటల్ సిద్ధమైంది. ఈనెల 20న ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభిస్తారు.
10 లక్షల పిపిఇ కిట్స్, పది లక్షల ఎన్-95 మాస్క్ లు అందుబాటులో ఉంచారు. అవసరమైన ప్రత్యేక కిట్‌లన్నీ వైద్య సిబ్బందికి, డాక్టర్ల కు అందరికి అందుబాటులో ఉన్నాయి. ఇతర సిబ్బంది కి కూడా పిపిఇ కిట్స్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.
రోజుకు 5000 పరీక్షలు చేసే సామర్ధ్యానికి తెలంగాణా రాష్ట్ర ల్యాబ్‌లు చేరుకున్నాయి. ఇప్పుడు ఉన్నవాటితో పాటు సనత్ నగర్ ఇఎస్ఐతో పాటు మరొక హాస్పిటల్ కి కరోనా పరీక్షలు చేసేందుకు అనుమతి రానుంది.
తెలంగాణా ప్రభుత్వం ప్లాస్మా థెరపీ చేయడానికి అనుమతి కోరుతూ ఇప్పటికే సి ఎస్ ఐ ఆర్ కు విజ్ఞప్తి చేసింది. అనుమతి రాగానే ఈ విధానాన్ని మొదలు పెట్టనున్నారు.
గాంధీ ఆస్పత్రి, కింగ్ కోఠి , చెస్ట్ ఆస్పత్రిలో సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తున్నారు. ముఖ్యమంగతా ప్రతి బాత్రూం శుభ్రంగా ఉండేటట్లు 24 గంటలు మీరు నీరు వచ్చేలా ఏర్పాట్లు చేశారు.
పిల్లల తల్లిదండ్రులకు కరోనా వచ్చి పిల్లల్ని చుసుకొలేకపోతే ఆయాలను కూడా ఏర్పాటు చేశారు. గాంధీ లో పిల్లలకు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ, పౌష్టికాహారం అందిస్తున్నారు.