ఆంధ్ర ప్రదేశ్ లో దశల వారిగా లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశం ఉందని ప్రిన్సిపల్ సెక్రెటరీ (హెల్త్) జవహర్ రెడ్డి చెప్పారు. విదేశాల నుంచి 29 వేల మంది వచ్చారని, మర్కజ్ నుంచి వచ్చినవాళ్ళు 1,000 మంది ఉన్నారని కూడా అయన పేర్కొన్నారు. ఏపీలో 304 పాజిటివ్ కేసుల్లో 280కు మార్కజ్ లింకులున్నాయన్నారు జవహర్ రెడ్డి. ఇంటింటి సర్వేలో సుమారు 5 వేల మందిని గుర్తించామని, 3 లక్షల ర్యాపిడ్ టెస్టు కిట్స్ ఆర్డర్ ఇచ్చామని కూడా జవహర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇంకా 2 లక్షల మందికి టెస్టులు చేయాల్సి ఉందన్నారు.