English | Telugu
ఇండియాలో 25 లక్షలమంది మృత్యువాత పడవచ్చట!
Updated : Mar 24, 2020
ఇంటికే పరిమితం కావడం, సామాజిక దూరం పాటించడం వల్ల కరోనా కేసుల సంఖ్యను 62 శాతం వరకు తగ్గించొచ్చని.. తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటితో పోలిస్తే కేసుల సంఖ్యను 89 శాతం వరకు తగ్గించగలమని ఐసీఎంఆర్ తెలిపింది. కరోనా లక్షణాలు కనిపించని వారిని కనీసం 75 శాతం మందిని గుర్తించగలిగితే కరోనా వేగంగా వ్యాప్తి చేయకుండా అడ్డుకోగలమని తెలిపింది.
కరోనా లక్షణాలు కనిపించని 90 శాతం మందిని గుర్తించగలిగితే.. ఈ వ్యాధి సగటు సమయాన్ని 20 రోజులకు వాయిదా వేయగలమని ఐసీఎంఆర్ అంచనా వేసింది.
ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రీసెర్చ్ భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తిని అంచనా వేస్తూ ఒక జర్నల్ ను ప్రచురించింది. వైరస్ వ్యాప్తి ఫిబ్రవరి నుంచి 50రోజుల వ్యవధిలో ఢిల్లీలో ఒక కోటి కేసులు - ముంబైలో 40లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే మెడికల్ కౌన్సిల్ రీసెర్చ్ ప్రచురించిన ఈ జర్నల్ పూర్తిగా మ్యాథమెటికల్ మోడల్ అని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ్ తెలిపారు. వైరస్ ఇండియాలో ప్రవేశించడానికి ద్వారాలైన ఢిల్లీ - ముంబై - కోల్ కతా - బెంగళూరు వంటి నగరాల్లోని విమానాశ్రయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఈ రిపోర్ట్ను తయారుచేసినట్టు తెలిపారు.
దేశంలో కరోనా వ్యాప్తి ఇలాగే ఉంటె 30 కోట్ల మంది భారతీయులకి కరోనా సోకే అవకాశం ఉంది అని cddep డైరెక్టర్ రామణన్ లక్ష్మి నారాయణ ఆందోళన వ్యక్తం చేసారు. ఇప్పటినుండే ప్రజలు ప్రభుత్వాలు జాగ్రత్తలు పాటిస్తే ఈ సంఖ్యని 20 కోట్ల వరకు తగ్గించవచ్చు అని - లేదంటే దాదాపుగా 25 లక్షలమంది మృత్యువాత పడవచ్చని హెచ్చరించారు. అమెరికా బ్రిటన్ లో వైరస్ వ్యాప్తి పై అధ్యయనం చేసి ఈ వివరాలు చెప్పినట్టు అయన వెల్లడించారు.