English | Telugu
హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను వైద్యుల పర్యవేక్షణ లోనే వాడాలి: ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ
Updated : Mar 24, 2020
హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వినియోగిస్తే కరోనా రాదనే భావన కొన్ని పత్రికా కథనాల ద్వారా ప్రచారం లోకి వచ్చిందనీ, ఇది వాస్తవం కాదనీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. సాధారణ వ్యక్తులెవ్వరూ కూడా ఈమందును వినియోగించకూడదు. దుష్పరిణామాలకు దారితీస్తుందని కూడా ఆ శాఖ స్పష్టం చేసింది. కరోనా సోకిన వారికి మాత్రమే ఈమందును వాడాలని అఖిల భారత వైద్య పరిశోధన మండలి స్పష్టంచేసింది. ఇదికూడా ప్రత్యామ్నాయంలో భాగమే నని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
అంతేకాక కరోనా సోకిన రోగులకు, సేవలందిస్తున్న వైద్యులకు, సిబ్బందికి ముందు జాగ్రత్తగా మాత్రమే హైడ్రాక్సీ క్లోరోక్వీన్ వినియోగిస్తున్నారు. ఇది పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో దీన్ని పాటిస్తున్నారు. అందువల్ల కరోనా రాకుండా ఉండాలంటే. హైడ్రాక్సీ క్లోరోక్వీన్ వాడితే సరిపోతుందన్న భావనలోకి ప్రజలెవ్వరూ వెళ్లవద్దని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది. సాధారణవ్యక్తులెవ్వరూ కూడా ఈ మందును వినియోగించవద్దని కోరుతున్నాం.
హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ను కేవలం నిపుణుల పర్యవేక్షణలో, వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఇస్తున్నారు. కోవిడ్ సోకినవారికి, వారితో ఉన్నందువల్ల వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నవారికి పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఇస్తున్న మందు మాత్రమే. మందు తీసుకున్న వారు పూర్తి వైద్య పర్యవేక్షణలో ఉంటున్నారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది.