English | Telugu
దేశంలో మరణాలు 239, పాజిటివ్ సంఖ్య 7 వేల 447
Updated : Apr 11, 2020
ప్రధాని మోదీ మాస్క్ ధరించి ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయనతో పాటు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న సీఎంలు కూడా మాస్కులు ధరించారు.
ఇప్పటివరకు జరిగిన సమీక్షా సమావేశాల్లో ప్రధాని సామాజిక దూరం పాటించారు కానీ ఏ సందర్భంలో కూడా మాస్క్ మాత్రం ధరించలేదు. ఇప్పుడు ప్రధాని మోదీ ఇలా మాస్క్ ధరించి కనపించారు.
ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య అమాంతం పెరిగింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడువేలు దాటింది. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. దీంతో ఆయా రాష్ట్రా ప్రభుత్వాలు లాక్ డౌన్ పొడిగించాలంటూ కేంద్రానికి ఇప్పటికే విజ్ఞప్తి చేశాయి. లాక్ డౌన్ పొడిగింపుపై ఈ సమావేశంలో ప్రధాని చర్చించారు. అందరికీ అన్ని వేళల అందుబాటులో ఉంటానని, ఎవరికి ఎప్పుడు ఎలాంటి సాయం కావాలన్నా తనకు వెంటనే ఫోన్ చేయాలని ప్రధాని ముఖ్యమంత్రులకు సూచించారు.
మోదీ సమావేశం జరిగిన అనంతరం కేంద్ర ఆరోగ్యశాఖ జాయంట్ సెక్రటరీ మీడియా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 7447కు చేరాయన్నారు. మరణాల సంఖ్య 239కి చేరిందని ఆయన ప్రకటించారు. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 1035 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందన్నారు. 40 మంది చనిపోయారని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.