English | Telugu
లాక్‌డౌన్ రెడ్‌జోన్ల వరకే పరిమితం చేయండి: ప్రధానితో సీఎం జగన్
Updated : Apr 11, 2020
* రెడ్ జోన్ల కు మాత్రమే లాక్ డౌన్ ను పరిమితం చేయాలని ఏ.పి. సి.ఎం. సూచన
* సినిమా హాళ్లు, మాల్స్, పాఠశాలలు యథావిథిగా మూసేయాలన్న ముఖ్యమంత్రి
రెడ్ జోన్ల వరకే లాక్‌డౌన్‌ను పరిమితం చేయాలని ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి తన అభిప్రాయంగా చెప్పారు. రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జగన్.. రాష్ట్రంలో 676 మండలాల్లో 81 మండలాలను కరోనా ప్రభావిత మండలాలుగా గుర్తించామని తెలిపారు. ఈ మండలాల్లోనే లాక్‌డౌన్ కొనసాగించాలని కోరారు. జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవచ్చన్నారు. సినిమా హాళ్లు, మాల్స్, పాఠశాలలు యథావిథిగా మూసివేయవచ్చని జగన్ అభిప్రాయపడ్డారు.