English | Telugu
కోటి రూపాయలు ఇస్తే.. ఈ ఘటనను మరిచిపోవాలా? సి.ఎం.పై మండిపడ్డ స్థానికుడు
Updated : May 10, 2020
ముఖ్యమంత్రి స్థాయిలో విశాఖ వచ్చిన జగన్ ముందు ప్రజల వద్దకు వెళ్లకుండా కంపెనీ యాజమాన్యం వద్దకు వెళ్లారని పాత్రుడు విమర్శించారు. ఆప్పత్రిలో బాధితులను పరామర్శించిన జగన్.. ఆయా గ్రామాలను పరిశీలించాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. ఇప్పటికీ స్టైరిన్ ఇళ్లల్లో చిక్కుకుని అలాగే ఉందని, ఒక్కసారి చూడాలని విజ్ఞప్తి చేశారు.
మృతుల కుటుంబాలకు రూ. కోటి ఇస్తే.. అందరూ ఈ ఘటనను మరిచిపోతారనే ఉద్దేశంతో ఎక్స్‌గ్రేషియా ప్రకటించారా? అని అన్నారు.
ముఖ్యమంత్రి మధ్యాహ్నం వచ్చి.. సాయంత్రం వెళ్లిపోయారు, బాధితులు, గ్రామాలు కోలుకునేవరకు విశాఖలో ఉండలేకపోయారని.. ఇది ఎంతవరకు న్యాయమని శ్రీనివాస్ పాత్రుడు ప్రశ్నించారు.