English | Telugu
ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులకు రెడ్ కార్పెట్ వేస్తారా? లోకేష్
Updated : May 10, 2020
ప్రజల చావుకు కారణమైన కంపెనీ ప్రతినిధులకు రెడ్ కార్పెట్ వేసి మాట్లాడుతున్నారని లోకేష్ మండిపడ్డారు. పైగా అదో గొప్ప కంపెనీ అని కితాబు ఇచ్చారని.. కానీ ప్రశ్నించిన ప్రజలను మాత్రం అణిచివేస్తున్నారని లోకేష్ ఫైర్ అయ్యారు. పైగా ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోతున్నారంటూ మంత్రులు మదంతో మాట్లాడుతున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కంపెనీని అక్కడి నుంచి తరలించాలని లోకేష్ డిమాండ్ చేశారు.
గ్యాస్ లీకేజీ నష్ట తీవ్రతను జగన్ దాచే ప్రయత్నం చేయడం తగదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. విష వాయువుల విడుదల వల్ల జరిగే అనర్థాలకు వాస్తవాలే సాక్ష్యాలంటూ ట్విట్టర్‌లో ఫొటోలు పోస్ట్ చేశారు చంద్రబాబు. స్థానికుల ఆరోగ్యంపై విష వాయువులు చూపే ప్రభావం సహించలేనిదంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.