English | Telugu
కరోనాతో కలిసి బ్రతకాల్సిందే: సి.ఎం. కేసీఆర్
Updated : May 5, 2020
హైకోర్టు ఆదేశాల ప్రకారం పదవతరగతి పరీక్షలు పూర్తి చేస్తాం. రేపటి నుంచి ఇంటర్ స్పాట్ వ్యాల్యూయేషన్ ప్రారంభిస్తాం.
65 ఏళ్ళు దాటిన వారు, చిన్నపిల్లలు బయటికి రావద్దని సి.ఎం. విజ్ఞప్తి చేశారు. రెడ్‌జోన్లలో షాప్‌లు తెరిచే అవకాశం వుంది కానీ ఎట్టి పరిస్థితుల్లోను అనుమతి ఇవ్వడం లేదు. గృహనిర్మాణ యాక్టివిటీకి అనుమతి ఇచ్చాం. నిత్యావసరవస్తువుల షాపుల్ని అనుమతించామని సి.ఎం. తెలిపారు. షాపులన్నీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచివుంటాయి.
చిల్లర రాజకీయాలు, చీప్ పాలిటిక్స్ కొంత మందికి అలవాటైపోయింది. ఉచిత వినోదం పంపే జోకర్లు, భఫూన్‌గాళ్ళని తెలంగాణా ప్రజలు వారిని చూసి నవ్వుకుంటున్నారని సి.ఎం. కేసీఆర్ ఎద్దేవా చేశారు. కనీసం ఏ సమస్యపై పోరాడాలనే తెలివి కూడా లేకుండా ఛండాలంగా వ్యవహరిస్తూ పనికిమాలిన ధర్నాలు చేస్తూ అభాసుపాలు కావద్దని కేసీఆర్ సూచించారు.
చిల్లరగాళ్ళ మాటల్లో పడి రైతులు భవిష్యత్ చెడగొట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు. రైతులు ఆలోచించండి. మాకు కమిట్‌మెంట్ వుంది. వంద శాతం రైతుల్ని ఆదుకుంటాం. రైతు బంధు యథాతథంగా కొనసాగిస్తాం సి.ఎం. భరోసా ఇచ్చారు.
రాజకీయ డ్రామాల్లో ఇరుక్కుంటే మీరే నష్టపోతారు. తెలంగాణాలో వున్నది రైతు రాజ్యం. చిల్లరగాళ్ళ రాజ్యం కాదు. రైతుసంక్షేమం పేదల సంక్షేమంలో రాజీ పడం. మే 15న మరోసారి సమీక్ష చేసి సడలింపుల విషయంలో నిర్ణయం తీసుకుంటామని సి.ఎం. తెలిపారు.