హైదరాబాద్ లోని ఎర్రగడ్డ పోలీసు చెక్ పోస్ట్ వద్ద కారులో వెళ్తున్న ముగ్గురు చైనా యువతుల్ని సనత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చైనా దేశానికి చెందిన ఇద్దరు యువతులు, నాగాలాండ్ కు చెందిన ఓ యువతి ఉన్నట్టు సమాచారం. ఈ ముగ్గురూ ఓ కారులో వెళ్తుండగా ఆపిన పోలీసులు, వారి నుంచి ప్రస్తుతం సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. కరోనా ఆరోగ్య పరీక్షల తనిఖీ కోసం క్వారంటైన్ కు పంపుతామంటున్న సనత్ నగర్ పోలీసులు.