English | Telugu
రెండు నెలల తర్వాత ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు
Updated : May 25, 2020
నిజానికి చంద్రబాబు ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించేందుకు విశాఖ వెళ్లాలనుకున్నారు. వెళ్లేందుకు అనుమతి తీసుకున్నప్పటికీ.. విమాన సర్వీసులు ప్రారంభం కాకపోవడంతో చివరి నిమిషంలో విశాఖ పర్యటన వాయిదా పడింది. విశాఖ పర్యటన వాయిదా పడిన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఏపీకి చేరుకున్నారు. 27, 28వ తేదీల్లో జరిగే మహానాడు కార్యక్రమాలకు అమరావతి నుంచే హాజరుకానున్నారు.
ఈ నెల 27, 28న మహానాడును నిర్వహించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. కరోనా కారణంగా ఈ సారి ఆన్‌లైన్‌లో మహానాడును నిర్వహించనున్నారు. జూమ్ యాప్ ద్వారా సుమారు 14 వేల మంది పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించారు.