English | Telugu
చిక్కుల్లో టీడీపీ నేత కూన రవికుమార్
Updated : May 25, 2020
ఈ నెల 18న గోరింట గ్రామంలో కూన సోదరుడుకి చెందిన రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లు మట్టిని అక్రమంగా తవ్వి తరలిస్తుండగా.. వీఆర్వో సమాచారం మేరకు తహసీల్దార్ అక్కడకు చేరుకుని వాహనాలను సీజ్ చేశారు. దీంతో రవి కుమార్ తహసీల్దార్‌కు ఫోన్ చేసి దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు.
ఇది జరిగిన వారం రోజులకు తహసీల్దార్ రామకృష్ణ ఆకస్మిక బదిలీ అయ్యారు. క్వారంటైన్‌లో వసతుల విషయంలో తహసీల్దార్ చేతివాటం ప్రదర్శించారంటూ కూన జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు తహసీల్దార్ రామకృష్ణపై బదిలీ వేటు వేశారు.
అయితే కూన సోదరుడుకి చెందిన వాహనాలు సీజ్ చేసినందుకు తనపై కక్షకట్టి బదిలీ అయ్యేలా చేశారని తహసీల్దార్ ఆరోపిస్తూ.. కూన రవికుమార్ ఫోన్‌లో దుర్భాషలాడిన ఆడియోను విడుదల చేశారు. ఇప్పటికే, కూనరవి మీద పొందూరు పీఎస్ లో తహశీల్దార్ ఫిర్యాదు చేసినట్టు సమాచారం.