English | Telugu

జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన బాబు

ఉపాధి హామీ నిధులు రెండు వేల ఐదు వందల కోట్లు విడుదల చేయకుండా వైసీపీ ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు చంద్రబాబు. టిడిపి హయాంలో చేపట్టిన నరేగా పనులపై వైసిపి ఎన్నో ఆరోపణలు చేసిన ఒక్కదాన్ని కూడా నిరూపించలేక పోయిందని అన్నారు. కేంద్రం ఇప్పుడు నిధులు విడుదల చేసిన వైసిపి ప్రభుత్వం విడుదల చేయడం లేదని చంద్రబాబు విమర్శించారు. 5-8-2019 ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు, 8-7-2019 ఆరు వందల నలభై ఒక్క కోట్లు, 9-4-2019 మూడు వందల అరవై కోట్లు మొత్తం కలిపి పధ్ధెనిమిది వందల నలభై ఐదు కోట్లు వాళ్ళు ఇచ్చారు. మన వాట ఆరు వందల పదిహేను కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చంద్రబాబు పేర్కొన్నారు.

రెండూ కలిపితే మొత్తం 2460 కోట్ల రూపాయలు డబ్బులున్నాయి. ఆ డబ్బులు మొత్తాన్ని కూడా మూడు రోజులలో తమ అకౌంట్ లో వేయాలని, డబ్బులు పంచాయతీలోకి వెళ్ళిపోవాలి అని ఆయన సూచించారు, మూడురోజులలో అకౌంట్ లోకి డబ్బులు జమకాకపోతే కనుక పన్నెండు శాతం వడ్డీతో ఇవ్వాలని చంద్రబాబు తెలియజేశారు.దానిపైననే ఇప్పుడు గొడవ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాల ప్రకారం తమ అకౌంట్ లోకి డబ్బులు రావాలని , ఇప్పుడు సర్పంచ్లు లేక పోయినాకనీసం పంచాయతీల ఎకౌంట్ కి అయిన రావాలి అని ఆయన వెల్లడించారు. పంచాయతీ అకౌంట్ నుంచి మొదట ఎవరు వచ్చి పనులు చేస్తారో వాళ్ళకు డబ్బులు ఇచ్చేసేయాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దొంగ లెక్కలు రాయడంలో ఆరితేరిన జగన్ అడ్డంగా దొరికిపోయాడని అన్నారు చంద్రబాబు.

రంగులు ఎక్కడ పడితే అక్కడ వేయడం కాదని వారి ముఖాలకు వేసుకుంటే అరాచకాల చేస్తోంది వారేనని జనం గుర్తుపడతారని కామెంట్ చేశారు. ప్రతి ఒక్క ఊరిలో సిమెంట్ రోడ్లు వేశామని, మురికి కాలువలు కట్టామని,బిల్డింగ్స్ కట్టామని, స్మశానాలు కట్టామని,ఏడు లక్షల పంటకుంటలు తవ్వితే అన్ని పంటకుంటలకు నీళ్లు సంవత్సరానికి పదిసార్లు వచ్చాయని చంద్రబాబు పేర్కొన్నారు. పదిసార్లు వచ్చాయి కాబట్టి భూగర్భ జలాలు విపరీతంగా పెరిగాయని, కరువు తీరిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంత వరకు ఒక తట్ట మట్టి వేయలేదు ఇరిగేషన్ లో రంగులు మార్చారు ప్రధాన వాళ్ల ముఖాలకే రంగులేసుకోవటమే సరిపోతుంది. వీళ్ళు దొంగల కింద చలామణి అవుతారు కాబట్టి వాళ్ళు ముఖానికి వేసుకొని తిరిగితే పబ్లిక్ గుర్తుపడతారు జాగ్రత్తగా ఉండాలని బాబు భావాన్ని వెల్లడించారు.