English | Telugu
తారక్ పొలిటికల్ ఎంట్రీపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు!!
Updated : Jun 2, 2020
ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో బాలకృష్ణకు తారక్ పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రశ్న ఎదురైంది. "జూనియర్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తులు కూడా పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తే అటు తెలంగాణ, ఇటు ఆంధ్రాలో పార్టీకి పూర్వ వైభవం వస్తుంది అనే వాదన ఉంది" అంటూ యాంకర్ అడిగారు. దీనిపై స్పందించిన బాలకృష్ణ.. ‘‘అది డేడికేషన్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది" అన్నారు. "అదీగాక మీరు ఫుల్ టైమ్ పాలిటిక్స్ అంటున్నారు. తనకు సినిమా యాక్టర్‌గా చాలా భవిష్యత్తు ఉంది. మరి వాడిష్టం. ప్రొఫెషన్ వదులుకుని రమ్మనముగా. ఇప్పుడు నేనున్నాను ఎమ్మెల్యేగా ఉన్నాను, సినిమాల్లోనూ యాక్ట్ చేస్తున్నాను. నాన్నగారు కూడా సీఎంగా ఉన్నప్పుడు సినిమాల్లో యాక్ట్ చేశారు. కాబట్టి వారి వారి ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది’’ అని బాలకృష్ణ సమాధానమిచ్చారు.