English | Telugu

అవమాన భారంతో ఏమి చేసుకోకు సాయిరెడ్డి! అయ్యన్నట్వీట్స్

టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడిని ఉద్ద్యేశించి వ్యాఖ్యలు చేసిన ఎంపీ విజయసాయిరెడ్డిపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... ‘‘అడిగిన వాడికి, అడగని వాడికి విశాఖ అంతా నాదే అని బిల్డప్ ఇచ్చాడు. కారులోంచి గెంటేయడం హఠాత్ పరిణామమే. ఆయన లేకుండానే విశాఖలో అన్నీ జరిగిపోవడం తట్టుకోలేక తీవ్ర ఫ్రాస్ట్రేషన్‌కి గురయ్యాడు. ఎవరిపై ఏడవాలో తెలియక చంద్రబాబు గారి నామ జపం చేస్తున్నాడు.

ముందు తాడేపల్లి కలుగులో పబ్జీ ఆడుతున్న ఏ1ని నిద్రలేపు.. ప్రజలంతా బీచ్ రోడ్డులో పడుకుంటున్నారు సాయిరెడ్డి. నీ ట్వీట్లు చూస్తుంటే జగన్‌కి చేతకాదు రావాలి బాబు గారు, కావాలి బాబు గారు అన్నట్టు ఉంటున్నాయి. ఇంతకీ నువ్వేక్కడ ఉన్నావు. కారు దించేసారు అన్న అవమాన భారంతో ఏమి చేసుకోకు సాయిరెడ్డి’’ అంటూ అయ్యన్నపాత్రులు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.