English | Telugu
అరెస్ట్ లేదు, ఒక్క ఆస్తిని జప్తు చేయలేదు సీఎం ఎక్కడ ఉన్నారు?: చంద్రబాబు ట్వీట్
Updated : May 9, 2020
జరిగిన దుర్ఘటనతో భయకంపితులైన విశాఖ ప్రజలు రోడ్లపైనే పడుకుంటున్నారని తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ స్థానికులు వీధుల్లోకి వచ్చిన నిరసనలు తెలుపుతున్నారని, ఆప్తులను కోల్పోయిన కుటుంబాలు తమవారి మృతదేహాల పక్కన దీనంగా రోదిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఘటనకు బాధ్యులైన ఒక్కరినీ అరెస్ట్ చేయలేదని, కనీసం ఒక్క ఆస్తిని కూడా జప్తు చేయలేదని, ఇంతకీ వైఎస్ జగన్ ఎక్కడున్నాడు? అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.