English | Telugu
21న జెడ్పీటీసీ, ఎంపీటీసీ... 23న మున్సిపోల్స్... 27, 29న పంచాయతీ ఎన్నికలు
Updated : Mar 7, 2020
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఒక విడతలో... పంచాయతీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనున్నారు. అలాగే, మున్సిపల్ ఎన్నికలను ఒకే విడతలో పూర్తి చేయనున్నారు. ఈనెల 21న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించి... 24న ఫలితాలను ప్రకటించనున్నారు. అలాగే, 23న మున్సిపోల్స్ నిర్వహించి... 27న ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక, మార్చి 27న తొలి విడత పంచాయతీ ఎన్నికలు... 29న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
# జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
మార్చి 9 నుంచి 11 వరకు నామినేషన్ల స్వీకరణ
మార్చి 12న నామినేషన్ల పరిశీలన
మార్చి 14వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు
మార్చి 21న పోలింగ్
మార్చి 24న ఓట్ల లెక్కింపు
# మున్సిపల్ ఎన్నికలు
మార్చి 11 నుంచి 13 వరకు నామినేషన్ల స్వీకరణ
మార్చి 14న నామినేషన్ల పరిశీలన
మార్చి 16వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు
మార్చి 23న పోలింగ్
మార్చి 27న ఓట్ల లెక్కింపు
# తొలి విడత పంచాయతీ ఎన్నికలు
మార్చి 17నుంచి 19వరకు నామినేషన్ల స్వీకరణ
మార్చి 20న నామినేషన్ల పరిశీలన
మార్చి 22వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు
మార్చి 27న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు
# రెండో విడత పంచాయతీ ఎన్నికలు
మార్చి 19 నుంచి 21 వరకు నామినేషన్ల స్వీకరణ
మార్చి 22న నామినేషన్ల పరిశీలన
మార్చి 24వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు
మార్చి 29న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు