English | Telugu

లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని హై కోర్టు ఆదేశం

కరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను గౌరవిస్తూ... భౌతిక దూరం పాటించాలని రాజకీయ నాయకులను..... హైకోర్టు ఆదేశించింది. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులకు తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో సామూహిక సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడం మేలని అభిప్రాయం వ్యక్తంచేసింది. విశాఖ జిల్లా చోడవరంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు నిర్వహించిన సమీక్ష సమావేశంలో భౌతిక దూరం పాటించలేదంటూ న్యాయవాది లక్ష్మీనారాయణ హైకోర్టుకు రాసిన లేఖపై ధర్మాసనం విచారణ జరిపింది.