జలుబు, దగ్గు, జ్వరంతో వచ్చే వారికి ఆర్ఎంపీలు వైద్యం చెయ్యొద్దని, కరోనా అనుమానితులు వస్తే వెంటనే ప్రభుత్వ వైద్యులకు సమాచారం ఇవ్వాలని ఆర్ఎంపీల కు ఏపీ ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులు ఉల్లంఘిస్తే ఆర్ఎంపీలపై కఠిన చర్యలుంటాయని కూడా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.