English | Telugu

గుజరాత్ నుంచి ఏపీ మత్స్యకారుల తరలింపు మొదలు

మొత్తం 64 బస్సుల్లో గుజరాత్ నుంచి 4,350 మంది మత్స్యకారులను ఆంధ్ర ప్రదేశ్ కు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. గుజరాత్ వీరావల్ నుంచి కాసేపట్లో ఏపీకి 20 బస్సులు బయల్దేరుతున్నట్టు అధికారులు చెప్పారు. ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. మార్గం మధ్యలో మత్స్యకారులకు ఆహార కొరత రాకుండా చర్యలు తీసుకున్నట్టు కూడా గుజరాత్ ప్రభుత్వం పేర్కొంది.