English | Telugu

13 జిల్లాలలో కొత్తగా 82 కరోనా పాజిటివ్ కేసులు

గత 24 గంటల్లో రాష్ట్రంలో ని 13 జిల్లాలలో కొత్తగా 82 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. మొత్తం రాష్ట్రంలో 1259 నమోదు కాగా వారిలో 970 మంది క్రియాశీలకంగా ఉన్నారని, 258 మందిని విడుదల చేశామని, రాష్ట్రంలోమొత్తం ఇప్పటి వరకు 31 మంది మరణించారని తెలిపారు. గత 24 గంటల్లో మొత్తం 5783 కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 82 మందికి కరోనా పోసిటివ్ గా నిర్ధారించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 80,344 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామన్నారు. రాష్ట్రంలో 10 లక్షల మంది జనాభాకు 1504 సగటు పరీక్షలు నిర్వహించడం ద్వారా దేశంలోనే పరీక్షల నిర్వహణ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొలి స్థానం లో నిలిచిందన్నారు.పరీక్షలు చేసిన వాటిలో 1.57 శాతం పోసిటివ్ కేసులు రాష్ట్రంలో నమోదు అవుతున్నాయి. దేశంలో 7,16,733 మందికి పరీక్షలు చెయ్యగా 29,572 మందికి నిర్ధారణ అయినది, ఇది 4.13 శాతమని కూడా జవహర్ రెడ్డి చెప్పారు.