English | Telugu

నేడు జగన్ హైదరాబాద్ పర్యటన రద్దుకు కారణం ఇదే...

ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ పర్యటన రద్దయ్యింది. ఆస్తుల కేసులో నేడు విచారణ లేకపోవడంతో జగన్ హైదరాబాద్ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. సీబీఐ జడ్జి సెలవులో ఉండటంతో విచారణ వాయిదా పడినట్లు సమాచారం. ఆస్తుల కేసు వ్యవహారంలో ఈ రోజూ సీబిఐ కోర్టుకూ జగన్ హాజర్ కావాల్సిన నేపధ్యంలో, ఈ రోజు సీబీఐ న్యాయమూర్తి సెలవులో ఉన్న కారణంగా ఆయన పర్యటన రద్దు అయినట్లు సమాచారం. అయితే, జగన్ వస్తున్న సమాచారం మేరకు తెలంగాణ పోలీసులు ఉదయం సీబీఐ కోర్టు వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఇక జగన్ రాకపోవడంతో ఆ భద్రతను మొత్తం ప్రస్తుతం తొలగించినట్లు సమాచారం.

జగన్ గతంలో సీబీఐ కోర్టు కేసు నుంచి ఈడి కేసు నుంచి మినహాయింపు కోరుతూ సీబీఐ కోర్టులో మినహాయింపు పిటిషన్ దాఖలు చేసారు కానీ జగన్ కు చుక్కెదురైంది. దీంతో హైకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు జగన్. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ప్రస్తుతం కేసు కొనసాగుతున్న నేపధ్యంలో జగన్ వేసిన పిటిషన్ పై సీబీఐ అధికారులు కూడా కౌంటర్ దాఖలు చేశారు. మొత్తం మీద జడ్జి సెలవు పుణ్యమా అని సీఎం జగన్ ఈ రోజు విచారణ నుంచి ఉపశమనం పొందారు.