English | Telugu

కర్నూలులో జ్యుడిషియల్ కాపిటల్ నిర్మాణానికి భూ సేకరణ చేపట్టిన ఏపీ సర్కార్...

కర్నూలులో ఏపీ హైకోర్ట్ ఏర్పాటు చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అన్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు కర్నూల్ జిల్లా లో హైకోర్ట్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. కోర్టు నిర్మాణానికి అనువైన స్థలం ఎక్కడ ఉందనే చర్చ సాగుతోంది. జ్యుడిషియల్ కాపిటల్ నిర్మాణానికి ప్రభుత్వం భూ సేకరణ చేపట్టింది. కర్నూలులో ఉన్న ఏపీఎస్పీ బెటాలియన్ వోర్వకల్లుకు షిప్ట్ చేయబోతున్నట్లు సమాచారం. ఆ ప్రాంతంలో హై కోర్టు నిర్మాణం చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లుగా అధికార వర్గాల సమాచారం.

ఆంధ్ర రాష్ట్రానికి కర్నూల్ రాజధానిగా ఉన్నప్పుడు ఏర్పడ్డ బెటాలియన్ తిరిగి కర్నూలు రాజధాని అవుతున్న సందర్భంగా మరో ప్రాంతానికి తరలి పోతోందన్న చర్చసాగుతోంది. కర్నూలు నగరంలోని సెకండ్ బెటాలియన్ లోనే జుడిషియల్ క్యాపిటల్ నిర్మాణం జరగబోతుందనే అంశం ప్రశ్నార్ధకంగా మారింది. ఇందులో భాగంగానే జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు అందరు కూడా ఓర్వకల్ దగ్గరున్న ప్రభుత్వ భూములను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద ఏపీ సీఎం జగన్ నిజంగానే అమరావతి నుంచి రాజధానిని మార్చబోతున్నారా అనే విషయం ఇప్పుడు అందరిలో ఉత్కంఠతను రేకెత్తిస్తొంది.