English | Telugu

లాక్ డౌన్ లో పేదలకు ఆర్థికసాయం కోసం అదనపు నిధులు

పేదలకు ఆర్థిక సాయం అందించే అదనపు మొత్తాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. 43.82 కోట్ల రూపాయలకు పాలనా అనుమతులను ఏపీ సర్కార్ జారీ చేసింది. తొలిదశలో ఆర్థికసాయం అందని కుటుంబాలకు 1000 రూపాయల చొప్పున పంపిణీ చేస్తారు. తొలిదశలో రేషన్ తీసుకుని ఆర్థికసాయం పొందనివారికి నగదు పంపిణీ చేస్తారు. వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయాల్సిందిగా సెర్స్ ని ప్రభుత్వం ఆదేశించింది. తొలిదశలో ఆర్థికసాయం పంపిణీ చేసేందుకు 133 కోట్లు విడుదల చేయగా ,98 లక్షల పైగా రేషన్, 1.33 కోట్ల బియ్యం కార్డు దారులకు నిధులు కేటాయించారు.