English | Telugu

యథావిథిగా మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ 25న

మద్యం కుంభకోణంలో అరెస్టై ప్రస్తుతం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజంపేట ఎంపీ, వైసీపీ కీలక నాయకుడు అయిన మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. దీంతో ఆయనను జగన్ ఈ నెల 25న పరామర్శ యథావిధిగా జరుగుతుంది. వాస్తవానికి జగన్ ఇప్పటి వరకూ మద్యం కుంభకోణంలో అరెస్టైన ఎవరినీ పరామర్శించలేదు. దీంతో జగన్ మద్యం కుంభకోణం నిందుతులకు ముఖం ఎందుకు చాటేస్తున్నారన్న అనుమానాలు వైసీపీలోనే బలంగా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక తప్పదన్నట్లుగా జగన్ ఈ నెల 25న మిథున్ రెడ్డిని పరామర్శించడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. అయితే తాను జైలుకు వెళ్లి పరామర్శించాల్సిన అవసరం లేకుండా ఆయనకు బెయిలు వచ్చేస్తుందని ఆశించినట్లుగా కనిపిస్తోంది. అయితేమిథున్ రెడ్డి బెయిలు పిటిషన్ నుఏసీబీ కోర్టు కొట్టివేసింది. దీంతో అనివార్యంగా, ఇష్టం ఉన్నా లేకున్నా జగన్ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో మిథున్ రెడ్డిని పరామర్శించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇదే కేసులో అరెస్టై విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నభారతీ సిమెంట్స్ ఆడిటర్ బాలాజీ గోవిందప్ప, మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలు దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్లను కూడా ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది.

ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా సిట్ దర్యాప్తు బృందం అధికారులు వీరికి బెయిలు మంజూరు చేయవద్దంటూ కోర్టును కోరడమే కాకుండా, మద్యం కుంభకోణంలో వారి పాత్రను నిర్ధారించే పలు ఆధారాలను కోర్టుకు సమర్పించారు. అలాగే మ‌ద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి న‌గ‌దును త‌రలించ‌డంలోనూ.. కుంభకోణానికి రూప‌క‌ల్ప‌న చేయ‌డంలోనూ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. మిథున్ రెడ్డికి చెందిన కంపెనీకి మద్యం స్కాం సొమ్ము 5 కోట్ల రూపాయలు చేరిందనీ, అయితే ఆయన తెలివిగా వాటిని తిరిగి ఇచ్చేశారనీ సిట్ అధికారులు కోర్టులు ఆధారాలతో అందజేశారు.

అలాగే.. మాజీ ఐఏఎస్ ధ‌నుంజ‌య‌రెడ్డి, కృష్ణమోహన్ లు కూడా ఈ స్కాంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు. అదే విధంగా భారతీ సిమెంట్స్ ఆడిట‌ర్ గోవింద‌ప్ప‌ మ‌ద్యం కుంభ‌కోణం ద్వారా వ‌చ్చిన నిధుల‌ను ఎలా మ‌ళ్లించాలి? ఏయే రంగాల్లో పెట్టుబ‌డులు పెట్టాలి? అనే విష‌యాల‌పై స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌డంతోపాటు.. 150 కోట్ల‌ను దారిమ‌ళ్లించార‌ని సిట్ అధికారులు కోర్టుకు వివ‌రించా రు. పిటిష‌నర్ల త‌ర‌ఫున న్యాయ‌వాదులు అస‌లు త‌మ వారికి మద్యం కుంభకోణంలో ఎలాంటి ప్ర‌మేయం లేద‌ని తెలిపారు. ఇరు పక్షాల వాదనలూ విన్న ఏసీబీ కోర్టు వీరందరి బెయిలు పిటిషన్లనూ డిస్మిస్ చేస్తూ తీర్పు వెలువరించింది.