English | Telugu

వ్యాక్సీన్ లేకుండానే కరోనా ఖతం! ట్రంప్ కొత్త భాష్యం!

'ఈ కరోనా త్వరలోనే నశిస్తుంది.. కొంతకాలం తరువాత మనం మళ్ళీ దీన్ని చూడబోం.. కొన్ని వైరస్ లు వస్తుంటాయి.. వాటికి టీకా వంటి వ్యాక్సీన్ లేకుండానే అవి అంతమవుతాయి' అని ట్రంప్ వ్యాఖ్యానించారు. మళ్ళీ వాటి జాడ కనబడదని ..ప్రతిదీ మరణించినట్టే అది కూడా మరణిస్తుందని ట్రంప్‌ చెప్పారు. కరోనా వ్యాధి వ్యాక్సీన్ లేకుండానే ఖతమవుతుందని కొత్త పల్లవి అందుకున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.

ఈ వైరస్ నశించాలంటే మనకు వ్యాక్సీన్ అవసరం లేదని.. ఇది అవసరమంటూ డాక్టర్లు చెబుతున్న దాన్ని తను నమ్మలేనని వ్యాక్సీన్ లేకుండానే కరోనా వ్యాధి నయమవుతుందని ట్రంప్ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఏదో ఒక కాలంలో ఈ వైరస్ లన్నీ నశించడం గ్యారంటీ అని ట్రంప్ 'జోస్యం' చెప్పారు.

గ‌తంలో ట్రంప్ కరోనా వ్యాధి చికిత్సకు వ్యాక్సీన్ ఎంతయినా అవసరమని, బహుశా ఏడాదిలోగా ఇది మనకు అందుబాటులోకి వస్తుందని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు మాట మార్చి అసలు ఇది అవసరమే లేదని ఢంకా బజాయిస్తున్నారు.