English | Telugu

ఉద్యోగుల జీతాల కోతపై వివ‌ర‌ణ ఇవ్వండి హైకోర్టుఆదేశం!

లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజాప్రతినిధులతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లలో కోత విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల వేతనాలు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లలో కోత విధించడం రాజ్యాంగ విరుద్ధమంటూ సీనియర్ న్యాయవాదులు రాసిన లేఖలను సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు స్వీకరించింది.

సీనియర్ న్యాయవాదులు సత్యంరెడ్డి, జంధ్యాల రవిశంకర్ రాసిన లేఖలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అమర్నాథ్ ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. దీనిపై ఏప్రిల్ 17 లోపు వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.