English | Telugu

ఏపీలో మరో రెండు పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 365కి చేరింది. నిన్న రాత్రి 9గంటల నుంచి ఇవాళ ఉదయం 9గంటల వరకు జరిగిన కొవిడ్‌-19 పరీక్షల్లో అనంతపురం జిల్లాలో రెండు కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో ప్రకటించింది. కరోనాతో ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరుగురు మరణించారు. కోలుకుని 10 మంది డిశ్చార్జి అయ్యారు.