English | Telugu

ఆర్టీసీ సమ్మెతో స్కూల్‌లకు మరో 2 రోజులు సెలవులను పొడిగించే ప్రయత్నంలో ఉన్న టీఎస్ ప్రభుత్వం

ఆర్టీసీ సమ్మె కొనసాగుతూ ఉండడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను విస్తృతం చేస్తోంది. పండగలకు ఊరు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యే వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటోంది టీఎస్ ప్రభుత్వం. అవసరమైతే విద్యాసంస్థల బస్సులను ప్రైవేట్ వాహనాలుగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం అవసరమైతే దసరా సెలవులను రెండ్రోజులు పొడగించాలని కూడా యోచిస్తోంది. రానున్న రెండు మూడు రోజుల్లో కోటిన్నర మంది ప్రయాణించే అవకాశముంది కావున తాము ప్రయాణికులు కొరకు ప్రత్యామ్నాయ మార్గాలకు నాంది పలుకుతున్నట్లు తెలియజేస్తున్నారు టీఎస్ అధికారులు. మరోపక్క సమ్మెపై వెనక్కి తగ్గబోమని జేఏసీ తాజా పరిణామాలపై చర్చించేందుకు సోమాజిగుడా ప్రెస్ క్లబ్ లో సమావేశమైంది. రాజకీయ పార్టీలు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు దీనికి హాజరయ్యారు.ఆర్టీసీ సమ్మె కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అవసరమైతే తెలంగాణ బంద్ కు పిలిపిస్తామని జేఏసీ నేతలు తెలిపారు. దసరా సెలవు లను మరో రెండు రోజుల పాటు పొడిగించే యోచనలో తెలంగాణ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే పండగ అయిపోవడంతో చాలా మంది ప్రయాణికులు తిరిగి సొంతూళ్ల కు పయనమవుతారు.

ఈ నేపధ్యంలో బస్సుల కొరత ఉన్నందువలన అవసరమైతే విద్యా సంస్థ లకు చెందిన బస్సులు ను వినియోగించుకునేందుకు వీలుగా రెండ్రోజుల పాటు సెలవుల్లో పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.దాదాపు ఎన్ని బస్సులను సిద్ధం చేయబోతున్నారు మరియు రెండ్రోజుల సెలవలను పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉన్న నేపధ్యంలో ఇటు ప్రైవేట్ స్కూల్ బస్సులు కానీ కాలేజీ బస్సుల వాడకం వల్ల ప్రయాణీకుల కష్టాల్లో కొంత మెరకు ఊరట కనిపిస్తుందా అనే అంశం పై పలు అనమానాలు వెల్లడవుతున్నాయి. ప్రభుత్వం ఈ సమ్మే పై చాలా కోపంగా ఉన్నట్లు తెలియజేస్తోంది.ఎట్టి పరిస్థితిలో తాము తమ నిర్ణయాన్ని వెనక్కు తగ్గేది లేదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశం పై ప్రభుత్వం ఎన్ని ప్రత్యామ్నాయ మార్గాలని అయిన ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడవుతోంది. ఈ సమ్మే పోరులో ఎవరు విజయం చేపడతారనేది చర్చనీయాంశంగా మారింది.