English | Telugu

ప్రపంచంలో అధిక అప్పులు చేసిన దేశంగా పాక్...


పాకిస్తాన్ లో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అందినచోటల్లా అప్పు లు చేస్తున్నారు. ఆర్ధిక సాయం కోసం ఆయన ప్రపంచ దేశాలన్నీ తిరుగుతుండగానే అక్కడి పరిస్థితి ని తేటతెల్లం చేస్తూ తాజాగా కొన్ని నివేదికల వెలుగు లోకొచ్చాయి. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది లోనే ఇమ్రాన్ ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల తొమ్మిది బిలియన్ల పాకిస్థానీ రూపాయల మేర అప్పు లు చేసింది. దీంతో అత్యధిక అప్పు లు చేసిన ప్రభుత్వంగా పాకిస్తాన్ ప్రభుత్వం రికార్డు నెలకొల్పింది.ఈ మేరకు స్టేట్ బ్యాంకు ఆఫ్ పాకిస్థాన్ ఇప్పటికే ప్రధాన మంత్రి కార్యాలయానికి రుణాల వివరాలు పంపింది. ఈ డేటా ప్రకారం ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికారం లోకొచ్చిన ఏడాది లోపే దాదాపు ఏడు లక్షల కోట్లు రుణంగా తీసుకున్నారు.రెండు వేల పధ్ధెనిమిది ఆగస్టు నుంచి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు వరకు విదేశీ వనరుల ద్వారా రెండు లక్షల ఎనభై వేల నాలుగు వందల కోట్లు అప్పు గా పొందింది.మరో నాలుగు లక్షల డెబ్బై వేల ఐదు వందల కోట్లు స్వదేశీ వనరుల ద్వారా తీసుకుంది. ఇంతకు ముందు పాకిస్థాన్ లోని ఏ ప్రభుత్వమూ ఏడాదిలోపు అంత రుణం తీసుకున్నది లేదు.

ప్రస్తుతం ప్రభుత్వ రుణం ముప్పై రెండు లక్షల ఇరవై నాలుగు వేల కోట్లకు చేరుకుంది.ఇమ్రాన్ అధికారంలోకి రాక ముందు పాకిస్థాన్ ఇరవై నాలుగు లక్షల డెబ్బై మూడు వేల రెండు వందల కోట్ల అప్పు ఉండేది. ప్రస్తుతం తొలి ఆర్థిక త్రైమాసాని కి పాకిస్తాన్ ఒక లక్ష కోట్ల మేర పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా తొంభై ఆరు వేల కోట్లు వసూలు చేయగలిగింది. దీనికి అదనంగా మరో ఐదేళ్ళలో నలభై ఏడు శాతం పాకిస్థాన్ అప్పుల పెరగనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.సౌదీ అరేబియా, చైనా లాంటి దేశాలు పాకిస్థాన్ కు బెయిల్ అవుట్ ప్యాకేజీ ఇచ్చినప్పటికీ దాయాది దేశ ఆర్థిక వ్యవస్థ గాడి లో పడలేదు. ఈ ఏడాది జూన్ లో ఖతార్ నుంచి పాకిస్థాన్ మూడు ట్రిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజ్ అందుకుంది. గత పదకొండు నెలలు పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ముందుకొచ్చిన గల్ఫ్ దేశాల్లో ఖతార్ నాలుగోది. అంతకుముందు యూఏఈ కూడా రెండు ట్రిలియన్ డాలర్ల మేర సొమ్ములు సమకూర్చింది. మరోవైపు తమ ఆర్థిక వ్యవస్థల సంక్షోభాన్ని మంచి గాడిలో పెట్టేందుకు పాక్ ప్రభుత్వం ఆరు బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి వద్ద ప్రాథమిక ఒప్పందం చేసుకుంది. ఇలా పాక్ ప్రధాని పాక్ దేశాన్ని ఇంత అప్పుల పాలు చేయడం చూసి జనాలు నివ్వెరపోతున్నారు.