English | Telugu

రాజ్యసభ ఎన్నికల్ని వాయిదా వేసిన ఈ.సి.

కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యసభ ఎన్నికలు వాయిదా వేసింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 26న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉంది. దేశంలోని పది రాష్ట్రాల్లో 37 సీట్లు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 18 సీట్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మిగిలిన సీట్లకు దాఖలైన నామినేషన్లు పరిశీలన పూర్తయింది. కానీ ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది ఈ.సి. ప్ర‌క‌టించింది. తదుపరి పోలింగ్, కౌంటింగ్ తేదీలను ప్రకటించనున్నారు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO సైతం కరోనాను ప్రపంచ అంటువ్యాధిగా ప్రకటించింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తున్నాం. ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియ అలాగే కొనసాగుతుంది. కరోనా వైరస్ తదుపరి పరిస్థితిని సమీక్షించిన అనంతరం తేదీలు ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటనలో వెల్ల‌డించింది.