English | Telugu

కర్ఫ్యూ ఉల్లంఘిస్తే 2లక్షల‌రూపాయ‌ల‌ జరిమానా!

సౌదీ అరేబియాలో మహమ్మారి కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కింగ్ సల్మాన్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు అక్కడి సర్కార్ కర్ఫ్యూ విధించింది. కర్ఫ్యూ సమయంలో ఎవరైతే ఆంక్షలను ఉల్లంఘిస్తారో వారిపై కఠిన చర్యలు ఉంటాయని తాజాగా అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. 10వేల రియాల్స్(రూ.2లక్షల 2వేలు) జరిమానాతో పాటు జైలుకి కూడా వెళ్లాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

అయితే వైద్య రంగానికి చెందిన ఉద్యోగులు, సెక్యూరిటీ, మిలిటరీ అధికారులకు మినహాయింపు ఇచ్చింది. సౌదీలో ఇప్పటి వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 562కి చేరింది. ఇక కర్ఫ్యూ సమయంలో దేశ పౌరులతో పాటు ప్రవాసులు కూడా ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు సూచించారు.