English | Telugu

ప్రాణాలు కాపాడుకుంటూ క‌రోనాపై యుద్ధం కొన‌సాగిద్దాం! ప్ర‌ధాని మోదీ

జాతిని ఉత్తేజ పరుస్తూ ప్ర‌ధాని మోదీ మ‌ళ్లీ ప్ర‌సంగించారు. 2020లో 20 ల‌క్ష‌ల కోట్ల ఆర్థిక ప్యాకేజ్‌ను ‌ప్ర‌క‌టించారు. ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ అభియాన్ ల‌క్ష్యంగా ప్ర‌ధాని ఆర్థిక ప్యాకేజ్‌ను ప్ర‌క‌టించారు. ఇది దేశ జిడిపిలో 10 శాతం. అన్నివ‌ర్గాల‌కు న్యాయం చేసేలా ఈ ప్యాకేజ్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ప్ర‌ధాని చెప్పారు. స్వ‌యం స‌మృద్ధికి ఈ ప్యాకేజ్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ప్ర‌ధాని అన్నారు.

ఒక వైర‌స్‌ ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తోంది. మ‌న‌వ‌త్వానికి ఇది ఒక పెద్ద ఛాలెంజ్‌గా మారింది. క‌రోనాపై పోరాటాంలో నాలుగు నెల‌లు గ‌డిచిపోయాయి. అయితే ఇది గెల్చి తీరాల్సిన యుద్ధం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 42 ల‌క్ష‌ల మందిపై క‌రోనా ప్ర‌భావం చూపింది. ప్రాణాలు కాపాడుకోవ‌డానికి యుద్ధం చేస్తున్నారు. ప్ర‌పంచంలో జీవ‌న్మ‌ర‌ణ పోరాణం కొన‌సాగుతోంది. దేశంలో అనేక మంది త‌మ వారిని కోల్పోయారు. ఈ విప‌త్తు క‌న్నా మ‌న సంక‌ల్పం గొప్ప‌ది. మ‌న ద‌గ్గ‌ర సామ‌ర్థ్యం వుంది.

ఇలాంటి విప‌త్క‌ర స్థితిని చూడ‌లేదు. విన‌లేదు. ఈ సంక్షోభం నుండి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోవాలి. ముందుకు న‌డ‌వాల్సిన అవ‌స‌రం వుంది. మ‌న ధృక్ప‌థం దృఢంగా వుండాలి. గ‌త శ‌తాబ్దం నుంచే వింటూనే వున్నాం. 21వ శ‌తాబ్దం భార‌త‌దేశానిదే. భార‌త పురోగ‌తే ప్ర‌పంచ పురోగ‌తిగా మారింద‌ని ప్ర‌ధాని అన్నారు.