English | Telugu

ఎల్జీ బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతా: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చంద్రబాబు నేతలతో మాట్లాడారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ ఘటనలో మృతిచెందిన వారికి నేతలంతా సంతాపం తెలిపారు. రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలియజేశారు.

బాధితులకు న్యాయం జరిగే వరకు టీడీపీ పోరాడుతుందని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. బాధితుల్లో భరోనా నింపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వారి భవిష్యత్తు కోసం, వారి ఆరోగ్యం కోసం చేయగలిగిన సాయం చేద్దామని హైద‌రాబాద్ నుండి చంద్ర‌బాబు పిలుపునిచ్చారు.