English | Telugu
మార్కెట్ ను డేటాల్ తో శుభ్రం చేయించిన మంత్రి!
Updated : Apr 19, 2020
కూరగాయల మార్కెట్లో వినియోగదారులు ఎవరికీ వారే సామాజిక దూరం పాటించేలా పోలీసులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని ఆదేశించారు. మార్కెట్లో ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని, మీరేమైనా ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారా. ? అంటూ మటన్ షాపు నిర్వాహకులను ఆరా తీశారు.
మటన్ షాపుకు వచ్చే వినియోగదారులు తమవెంట స్టీల్ బాక్సు తెచ్చుకోవాలని, చేపల మార్కెట్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొన్నదని వెంటనే శుభ్రం చేయించాలని మార్కెట్ నిర్వాహకులను మంత్రి ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మీట్, నాన్ మీట్, చేపల మార్కెట్ మొత్తాన్ని డేటాల్ తో శుభ్రం చేయించాలని ఏఏంసీ చైర్మన్ పాలసాయిరాంను ఆదేశించారు.