English | Telugu

స్కూబా డైవర్ల సాయంతో బోటు వెలికితీసిన ధర్మాడి సత్యం బృందం...

తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగి పోయిన రాయల్ వశిష్ట బోట్ వెలికితీత ప్రయత్నం ఎట్టకేలకు విజయవంతం అయింది.ధర్మాడి సత్యం బృందంతో పాటు స్కూబా డైవర్లు నిరంతరం కృషి చేసి దానిని బయటకు తీశారు. నెల రోజుల పాటు బోట్ నీటిలో ఉండిన కారణంగా రాయల్ వశిష్ట బోట్ పూర్తిగా ద్వంశం అయింది.పాపికొండలు వద్ద గత నెల పదిహేడున పర్యాటకులతో వెళుతున్న ఈ బోట్ మునిగిపోయింది.ప్రమాదం జరిగిన సమయంలో ఆ బోట్ లో 77 మంది ఉన్నారు.వీరిలో 39 మంది మృతు దేహాలు దొరకగా, 12 మంది గల్లంతు అయ్యారు, 26 మంది సురక్షితంగా బయట పడ్డారు అని సమాచారం.

బోట్ ని బయటకు తీసే ప్రయత్నంలో అందులో నుంచి రెండు మృతుదేహాలు కనిపించాయి. మరి కొన్ని మృతుదేహాలు బోటులోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. వాటిని మరి కాసేపట్లో బయటకు తీసే ప్రయత్నం చేయనున్నట్లు సత్యం బృందం తెలియజేసింది. నెల రోజులకు పై గా నీటిలో ఉండటంతో మృతుదేహాలన్ని గుర్తు పట్టలేని పరిస్థితిలో ఉన్నాయి. 38 రోజుల తరువాత రాయల్ వశిష్ట బోట్ బయట పడింది. కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం అలుపెరుగని పోరాటానికి, స్కూబా డైవర్లు తోడవటంతో రాయల్ వశిష్ట బోట్ ని బయటకి తీసుకువచ్చారు. బోట్ లో ఉన్న మృతుదేహాల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారి బందువుల కన్నీరుకు విముక్తి లభించింది. బోట్ ని వెలికితీసే ప్రయత్నంలో విజయం సాధించిన ధర్మాడి సత్యం బృందం మరియు స్కూబా డైవర్లు ను అధికారులు ప్రశంశిస్తున్నారు.