English | Telugu
సమ్మె పట్ల నిన్న పిటీషన్ పై హైకోర్ట్ లో కొనసాగుతున్న విచారణ...
Updated : Nov 7, 2019
నేడు హైకోర్ట్ లో జరుగుతున్న పిటీషన్ పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషి హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు నేరుగా హాజరై వివరణ ఇస్తున్నారు. ప్రభుత్వం ఆర్టీసీ ఎండీ జీహెచ్ఎంసీ దాఖలు చేసిన అఫిడవిట్లపై వాదనలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ విధించిన డెడ్ లైన్ ముగియడం, డెడ్ లైన్ లోపు ఎక్కువ సంఖ్యలో కార్మికులు విధులకు హాజరు కాకపోవడం తమ డిమాండ్ల సాధనకు జేఏసీ పట్టుబడుతుండటంతో హై కోర్టు విచారణలో ఏమి తేలనుంది అనే దానిపై ఉత్కంఠం నెలకొంది. ప్రస్తుతం హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. మొత్తం మూడు అంశాలపైన ఇవాళ విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా ఆర్టీసీ సమ్మెతో పాటు ఇటు నిన్న ప్రభుత్వం నుండి దాఖలు చేసిన అఫిడవిట్ ల పైన దీంతో పాటుగా ప్రైవేటీకరణకు సంబంధించిన మూడు అంశాలపైన ప్రస్తుతం ఇవాళ విచారణ కొనసాగుతుంది.
ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఆర్టీసీకి సంబంధించిన ఎండీ జీహెచ్ఎంసీ కమిషనర్ వీళ్ళందరూ కూడా హైకోర్టుకు వచ్చారు. నిన్న అఫిడవిట్ దాఖలు చేసిన అంశాలపైన ఏవైనా అభ్యంతరాలు ఉన్నాయా అన్న దానికి సంబంధించి కార్మికుల తరపున న్యాయవాదులు ప్రస్తుతం మాట్లాడుతున్నట్లు సమాచారం. మరొకవైపు చీఫ్ సెక్రెటరీ కూడా ప్రస్తుతం హైకోర్టులో ఉన్నారు. నిన్న అఫిడవిట్ లో ఆర్టీసీకి ఎంత వరకు బకాయిలున్నాయి. ఎంత వరకు చెల్లించారు అనే దానికి సంబంధించి వేరువేరుగా అఫిడవిట్ లను దాఖలు చేయటం జరిగింది.ఇటు జీహెచఎంసీతో పాటు ఆర్థిక శాఖ ఈ రెండు అఫిడవిట్ లను కూడా వేర్వేరుగా దాఖలు చేసింది. అలాగే ఆర్టీసీ కూడా ఇలాంటి ప్రభుత్వం నుండి ఎంత వరకు ఆదాయం రావాల్సి ఉంది అన్న దానికి సంబంధించి కూడా అఫిడవిట్ లో పేర్కొనటం జరిగింది. హై కోర్టు పూర్తి స్థాయిలో ఈ అఫిడవిట్ ను దాఖలు చేయాలని జారీ చేసిన ఆదేశాల మేరకు ఆ అఫిడవిట్ ను నిన్న ఇవ్వడం జరిగింది. ఈ రోజు దానికి సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటికి సంబంధించిన అంశాలపైనా ప్రస్తుతము వాదనలు కొనసాగుతున్నాయి. ఈ వాదనల తర్వాత హై కోర్టు ఏం చేయబోతుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉన్న పరిస్థితి ఉంది.