English | Telugu

బొల్లారం ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో 120మంది కార్మికులు

సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో వింద్య ఆర్గానిక్స్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. రియాక్టర్ పేలడంతో ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 120 మంది కార్మికులున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా కార్మికులకు గాయాలవగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. క్షతగాత్రులని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పొగలు దట్టంగా అలుముకోవటంతో లోపల ఎంత మంది కార్మికులు చిక్కుకున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.